ప్రమాదాల నివారణ మనందరి కర్తవ్యం కావాలి

“అరైవ్ ..అలైవ్” లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి కర్తవ్యం కావాలని.

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /14: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మానకొండూర్ ఎమ్మెల్యే ,టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి కార్యాచరణ లో భాగంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సోమవారం నిర్వహించిన ఆరైవ్-అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెచ్చుమీరకుండా రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యతమనందరిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన ఉదంతాలు అనేకం ఉన్నాయని, ఇందుకు రామకృష్ణ కాలనీకి చెందిన చెన్నాడి చెంద్రారెడ్డి కుటుంబమే ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. చిన్ని నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయని, వాహనాల సంఖ్య పెరగడం, అతి వేగం, డ్రైవింగ్ లో నిర్లక్ష్యం, మందుతాగి వాహనాలు నడపడాలు రోడ్డ ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు కూడా తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే పిల్లలకు బైక్ లు ఇవ్వవద్దన్నారు. జాతీయ రహదారిలో ఉన్న రామకృష్ణ కాలనీ నుంచి నిత్యం తాను నియోజవర్గ పర్యటనలు వెళుతుంటానని, పలు ప్రమాదాలను తాను స్వయంగా చూసిన ఉదంతాలు ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు తమ వారిని పోగొట్టుకొని అనుభవిస్తున్న క్షోభ, వారి వేదనలు విన్నప్పుడల్లా హృదయం ద్రవిస్తుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్తలు పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణే కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు,వాహనదారులకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. అంతేకాకుండా అన్ని విభాగాల అధికారులను సమన్వయ పరుస్తామన్నారు. ప్రమాదాల నివారణ చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. కరీంనగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారించే విషయంలో ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ ధరించపోవడం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలో జాతీయ రహదారిలో ఉన్న గ్రామాల ప్రజలను జాగృతపరుస్తున్నామన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సహాయ చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కళ్ల ముందే ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని, ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తులు సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తుంటారే తప్ప క్షతగాత్రులకు సాయపడకపోవడం అమానవీయమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల గురించి సమాచారం ఇచ్చిన వారికిగాని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లిన వారిపైగాని ఎలాంటి కేసులుండవని, పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పటికైనా అపొహను వీడి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో ఉన్న వారు క్షతగాత్రులకు సహాయ చర్యల్లో పాల్గొనాలని సీపీ కోరారు. అనంతరం సీపీతో కలిసి ఎమ్మెల్యే పలువురు వాహన చోధకులకు హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామ చౌరస్తాలో ప్రమాద నివారణకు సంబంధించి భద్రతా నియమాలు పాటిస్తామంటూ గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్ గుజ్జ శ్వేత, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో మల్హోత్రా, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్,మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, నుస్తులాపూర్ సర్పంచ్ తుమ్మనపల్లి సంథ్య, పోరండ్ల సర్పంచ్ అసోద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *