జగనన్న కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట మున్సిపల్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ వట్టెo మనోహర్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 15 జగ్గయ్యపేట పట్టణంలోని జగనన్న కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట మున్సిపల్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ వట్టెo మనోహర్ ఈ సందర్భంగా పక్కనే ఉన్న బాబు జగజీవన్ రావు కు పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది . మరియు విగ్రహం పక్కన అంబేద్కర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన వట్టెం మనోహర్ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక కులానికి చెందినవారు కాదని అన్ని కులాలు అన్ని మతాలు వర్గాల వారికి చెందినటువంటి మహానుభావుడని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో వారితోపాటు పట్టణ వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు దివ్వేల రామారావు, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు గోగుల వెంకయ్య, బీసీ నాయకులు డేరంగుల తిరుపతిరావు, జగనన్న కాలనీ వైఎస్ఆర్సిపి నాయకులు కనపర్తి సత్యం, మరియు జగనన్న కాలనీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మిఠాయిలు పంచి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వారికి జోహార్లు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *