పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 14, జూలూరుపాడు ఖమ్మం జిల్లా ,జూలూరుపాడు మండలం, పుట్టకోట గ్రామానికి చెందిన ఎస్కే అక్బర్ ,గౌస్య బేగం దంపతుల కుమారుడు షేక్ మదర్ సాహెబ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 467 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచి ఖమ్మం రైజోనెన్స్ కళాశాల లో జయ కేతనం ఎగరవేశారు.ఈ సందర్భంగా కళాశాల యజమాన్యం ,గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన షేక్ మదర్ సాహెబ్ ఎంపీసీలో 467/470 సాధించడం మాకెంతో సంతోషంగా ఉందని మున్ముందు మరెన్నో ర్యాంకులు సాధించి మా గ్రామానికి కళాశాలకి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు