ఇంటర్ ఫలితాలలో జమ్మికుంట కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన వార్షిక ఫలితాలలో జమ్మికుంట కేజీబీవీ కళాశాల, విద్యార్థులు ఉత్తమ ప్రతిభకనబరిచి మంచి ఫలితాలు సాధించారు. ఆదివారం బోర్డు ప్రకటించిన ఫలితాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ జి సహస్ర 458, బైపిసి ఎం హవిష్య 413,ద్వితీయ సంవత్సరం ఎంపీసీ జి చంద్రజ్యోతి 986, బైపిసి జీ వర్ష 905 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ మేడం కే సుప్రియ తెలిపారు. కాగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ హేమలత, ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *