చండూరులో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తా : ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ .

* ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 16 : చండూరు మున్సిపల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను త్వరలో చేపడుతమామని ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ డా|| ఇరుగుదిండ్ల భాస్కర్ అన్నారు . బుధవారం హైదరాబాద్ లోని అయన నివాసంలో కలిసిన ప్రెస్ క్లబ్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు అయన స్పందిస్తూ తమ ఫౌండేషన్ నిధుల నుండి భవన నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు . ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న, నల్ల స్వామి, కొత్త గంగాధర్, కురుపాటి శ్రవణ్, ఉప్పరబోయిన భగవంతం, సంగెపు మల్లిఖార్జున్, ఆడెపు శంకర్, కట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *