గార్లదిన్నె గ్రామంలో 135వ డా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఈరోజు అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాల సందర్భంగా పి ఆర్ ఎస్ వై ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి అని ఆయన చిన్న వయసులోనే అంటరానితనాన్ని కళ్ళ ద్వారా చూసి తాను స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో ఆ కాలంలోనే ఆయన చూసి వీటిని రూపుమాపాలంటే కచ్చితంగా విద్యతోటే సాధ్యమని ఆయన ఆరోజు కంకణం కట్టుకొని చదివి మనకోసం రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అదేవిధంగా స్త్రీలకు కూడా ఓటు హక్కును కల్పించాలని మొట్టమొదటిగా ఆ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనిఅన్నారు మరియు ఇలా భారతదేశానికి అంటరాని కులాల నుండి వచ్చినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవ చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయమని అలాంటి మహానుభావుడు జయంతి ఈరోజు మనము ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే సమాజంలో తలెత్తుకొని బతుకుతున్నాం అంటే ఆయన పెట్టినటువంటి బిక్షేనని వారు స్పష్టం ఈ కార్యక్రమంలో గార్లదిన్నె గ్రామ ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *