అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్షక కవచం

* భారత రాజ్యాంగ నిర్మాత, ‘విశ్వ మేధావి’ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు 15-4-2026 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మాచారెడ్డి మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చుక్కాపూర్ గ్రామ సర్పంచ్ , చుక్కాపూర్ గ్రామ అధ్యక్షుడు పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచులు మాట్లాడుతూ.భారత రాజ్యాంగం నేడు దేశంలోని ప్రతి పౌరుడికి రక్షక కవచంలా నిలుస్తోందని కొనియాడారు. “అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు; స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహనీయుడు” అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, అందుకే ప్రపంచం ఆయనను మేధావుల జాబితాలో అగ్రస్థానంలో నిలిపిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,వివో ఏ, అంగన్వాడీ టీచర్స్,ఏఎన్ఎం, ఆశలు,అంగన్వాడి ఆయాలు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్మెన్లు, ఆలయ కమిటీ చైర్మన్,లు అభిమన్య యూత్ అధ్యక్షులు, కులా సంఘాల అధ్యక్షులు,రెండు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేశారు.. ఘనముగా అంబేద్కర్ జన్మదిన వేడుకలు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు దళిత హక్కుల పరిరక్షణ సమితి మాచారెడ్డి మండల .మాచారెడ్డి బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహo వద్ద జన్మదిన వేడుకలు ఘనముగా మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మొదటగా దళిత హక్కుల పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు , జడ్పీహెచ్ఎస్  ప్రధానోపాధ్యాయుడు,పతాకావిష్కరణ చేశారు. అంబేద్కర్ ప్రతిమకు మొదటగా మాచారెడ్డి ఏస్ ఐ తో పాటు దళిత హక్కుల పరిరక్షణ అధ్యక్షులు పూలమాల అలంకరణ చేశారు. తదుపరి ఈ కార్యక్రమంలో చేరి మాస్టారు,హక్కుల సంఘం అధ్యక్షులు నాయకులు,యువకులు ఎస్సీ ఎస్టీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.అనంతరo ప్రజా సంఘాల  ప్రతినిధులు  బీజేపీ చుక్కాపూర్ గ్రం అధ్యక్షుడు , కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శి ,మండల  సీనియర్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *