పయనించే సూర్యుడు 15-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తడగొండ విజయ్, ప్రధాన కార్యదర్శి మద్దూరి నవీన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులు గా మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి,ఉపసర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి,పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలోని అసమానతలను తొలగించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెవులమది సంతోష్ సంఘ సభ్యులు,బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల కొమురయ్య సంఘ సభ్యులు,గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.