హక్కుల అణచివేతపైకార్మిక తిరుగుబాటు తథ్యం.

* ఏప్రిల్ 26 -28 వరకు తిరుపతి లో జరుగునున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను విజయవంతం చేయండి. * నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి,పాత చట్టాలను అమలు చేయాలి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు . కృష్ణయ్య మాట్లాడుతూ.. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో కార్యాలయంలో ఏఐటీయూసీ ఆఫీస్ బేరర్స్ సమావేశం బి వెంకన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులపై దాడులు పెరిగాయన్నారు. బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కాదని, 12 గంటల పనిని అమలు చేసేందుకు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గత 15 ఏళ్లుగా 50 లక్షల మంది షెడ్యూల్ కార్మికుల కనీస వేతనాల్లో పెంపుదల లేదన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాల పెంపును పాలకులు నిరాకరిస్తున్నారని తెలిపారు. రూ. ఎనిమిది వేల కోట్ల నిధులు ఉన్నా, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేటాయించకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. రాయలసీమలో కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు కాకుండా బయటి వ్యక్తులకు ఉద్యోగాలివ్వడం దారుణమని పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల బాటలో నడుస్తున్న పరిశ్రమలను నష్టాలు సాకుతో ప్రైవేటీకరణ చేసి,కారు చౌకగా అమ్మేస్తున్నారని విమర్శించారు. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరకొర వేతనాలతో కార్మికులతో పని చేయించు కుంటున్నారని, కాంట్రాక్టు/ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులుకి. అజయ్ బాబు మరియు ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఓబి నాగరాజ్ వైటి భీమేష్ ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు కల్లుబావిరాజు వడ్డే రాముడు లక్ష్మీనారాయణ హుస్సేనీ శిక్షావలి సోమన్న ప్రకాష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *