భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశేట్టి వేంకట్రావు యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 16 వత్సవాయి మండలం మంగొల్లు గ్రామంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పగడాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి న బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు కోరుకున్న విధంగా అభివృద్ధి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా భారత ప్రజలకు న్యాయం మేలు జరిగేలా చూడటం ఓక రాజకీయ పార్టీ గా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుందని నేటి మన ప్రదాని నరేంద్ర మెూడి ఆ విధంగా ముందు వుండి పరిపాలన కొనసాగిస్తున్నారు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు అని చెప్పారు మనం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మన్నె శ్రీనివాసరావు అసెంబ్లీ కన్వీనర్ పగడాల శ్రీనివాసరావు
మండల అధ్యక్షులు కాకాని వెంకటేశ్వరరావు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బొడ్డు మల్లికార్జునరావు కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మన్నె మాధవి జిల్లా మహిళామోర్చా కార్యదర్శి గంగవరపు శ్రీనివాసరావు మండల కార్యదర్శి మన్నె బ్రహ్మం గ్రామ అధ్యక్షుడు బిజైపి కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు జెట్టి హనుమంత రావు కందుల నరసింహ రావు జెట్టి భాస్కర రావు కందుల చిన్న జెట్టి తిరుపతి రావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *