పయనించే సూర్యుడు, ఏప్రిల్ 16, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. తెలంగాణ భట్రాజు సంఘం జనగామ జిల్లా ఎన్నికలు మంగళవారం వాణి హై స్కూల్ బచ్చన్నపేటలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా డాక్టర్ సి.వి.జయవీర్ రాజు రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు ఎన్నికల పరిశీలకులుగా కొనగంటి దయాకర్ రాజు వ్యవహరించారు. ఈ ఎన్నికలలో జిల్లా అధ్యక్షులుగా భాస్కరుని పృథ్వీరాజు, ప్రధాన కార్యదర్శిగా అంబటి కిషన్ రాజు, కోశాధికారిగా వ్యాసభట్టు గిరిధర్ రాజు, ఉపాధ్యక్షులుగా సింగభట్టు నర్సింహరాజు, మహేందర్ రాజు, వ్యాసభట్టు శ్రీనివాస్ రాజు ప్రచారకార్యదర్శిగా చెన్నమాధవుని సుదర్శన్ రాజు, సంయుక్త కార్యదర్శిగా పవన్ రాజు, కార్యదర్శులుగా అంబటి రాఘవేంద్రరాజు, వ్యాసభట్టు రమేష్ రాజు, ఎర్రం రాజు రామరాజు కార్యవర్గ సభ్యులుగా కాసు రమేష్ రాజు, నీలకంఠం ప్రభాకర్ రాజు, అంబటి ప్రకాష్ రాజు, అంబటి రఘుభూషణ్ రాజు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ప్రొఫెసర్ జయవీర్ రాజు మాట్లాడుతూ అన్ని కులాలకు వివిధ రకాల కుల వృత్తులు ఉంటాయి. కానీ భట్రాజు కులానికి చెందిన వారు విద్య మరియు సాహిత్యంను నమ్ముకొని జీవితాన్ని కొనసాగించడం జరుగుతుందని అనాది నుండి భట్రాజు కులానికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని అన్నారు. రాజుల కాలములో భట్రాజులతో అక్షరాభ్యాసం చేయించుకునేవారు అని, భట్రాజులతో అక్షరాభ్యాసం చేయించుకుంటే సరస్వతి కటాక్షం పుష్కలంగా ఉంటుందని అన్నారు. అక్షరాభ్యాసం బట్రాజులతో చేయించడం అనాదిగా రాజవంశీలకు ఉన్న నమ్మకం అని ఇది అనాదిగా ఉన్న సంప్రదాయం అని అన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు భాస్కరుని పృథ్వీరాజు మాట్లాడుతూ అందరి సహకారం తో సంఘం అభివృద్ధికి పాటుపడతామని అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
