ప్రభుత్వ ఆసుపత్రిలో100 పడకల క్రిటికల్కేర్ భవన ప్రారంభోత్సవం..

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో రూ. 40 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ బోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం భవ నం నిర్మాణం పనులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ,వైద్య కుటుంబ సంక్షేమ ,సైన్స్, టెక్నాలజీ శాఖామా త్యులు దామోదర రాజన ర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా,డి ఎం లలితదేవి,రా జేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి,తహసీల్దార్ మహి పాల్ రెడ్డి,తాజా మాజీ కార్పొ రేటర్లు హామీద్ పటేల్,నార్నె శ్రీనివాస రావు ల తో కలిసి శంకుస్థాపన చేసిన పి ఎ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిటికల్ కేర్ బ్లాక్ శంకుస్థాపన తర్వాత కొండా పూర్ హాస్పిటల్, డయాగ్నస్టిక్స్‌ హబ్‌ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,పిఎసి చైర్మన్ గాంధీ సందర్శించారు.వైద్య సేవలు, ల్యాబ్ టెస్టులు,తదితర అంశాలపై పేషెంట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ జిల్లా ఆసుప త్రిలో రూ.40 కోట్ల 50 లక్షల రూపాయల అంచనావ్య యంతో నూతనంగా నిర్మిం చబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభా గం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని మన నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడు తుంది అని , పేద ,మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరయ్యే నాణ్యమై న వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నా మని, ప్రజలందరూ సద్వినియో గం చేసుకోవాలని,అన్ని హంగులతో సకల సౌకర్యాల తో నిర్మించి ప్రజలకు త్వర లోనే అందుబాటులోకి తీసుకువ స్తామని, నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని పనులు త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వాలని చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు,వైద్య సిబ్బం ది, మాజీ కౌన్సిలర్లు,కార్పొరేటర్లు,నా యకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *