
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థికవేత్త, న్యాయకోవిందుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసిన ధీశాలి, భారత రాజ్యంగ నిర్మాత ,భారత రత్న శ్రీ. డా.బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సంద ర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, మహంకాళినగర్ చౌరస్తా, ఇందిరా హిల్స్ కాలనీలలో గల డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి పూలమల వేసి ఘనంగా నివాళ్లు అర్పించినపిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లడుతూ… డా. బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి శుభాకాంక్షలు తెలిపి, అదేవిదంగా డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని సమ సమాజ స్థాపన కోసం, సమా నత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించాలని, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,భారత రత్న డాక్టర్ అంబేద్కర్ దేశం కోసం ఎంతో కృషి చేశారని, రాజ్యాం గం రాసి నవ భారత నిర్మాణ అధ్యడు అని, ,ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందుతున్నావంటే అది బి ర్ అంబెడ్కర్ మనకు కలిపించిన హక్కు అని ,దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగాని రచించిన మేధావి , ఆయన ఆశయాల ను ,ముందుకు తీసుకుపోయి భవి ష్యత్తు తరాలకు తెలియచెయ్యాల్సిందిగా మనఅందరి బాధ్యత అని ఆయన ఆశయాలను సాధిద్దాం అని, అందుకు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం , స్ఫూ ర్తిదాయకం అని, ఆయన చూపిన బాటలో యువత పయనించాలని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పీఎసి చై ర్మన్ గాంధీ తెలియచేసారు. మనం ఎంచుకున్న మా ర్గం వెంట ఎలాంటి జంకు లేకుండా ముందుకు సాగి పోవాలనేదే భారత రాజ్యాంగ నిర్మాత, సమ సమాజ స్థాపన ఆలోచన ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ యమని, ప్రయాణం మొదలుపెడితే లక్ష్య సాధన వరకు వెనుక అడుగు వేయనీయదని అంబేద్కర్ బోధించా డు, ఆ మహనీయుడు చూపిన బాటలోనే ఈరోజు భారతదేశ వ్యవస్థలు నిర్మాణం కావడం దేశ ప్రజలం దరికీ గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ఇదొక్క మనకే పరిమితం కాలేదు.. ఇతర దేశాలు సైతం అంబే ద్కర్ రచించిన రాజ్యాం గాన్ని ఆదర్శంగా తీసుకోవడం నిజంగా మనందరికీ గొప్పతనం అని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరి జన బహుజన వర్గాలతోపాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందన్నారు. ఆయన కృషి ఒక్కటని ఏం చెప్పగలం.. వారికి మనం ఎంత చేసినా తక్కువేనని, ఆయన అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందాలని , ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ స్ఫూర్తితో అక్షరబాట పట్టాలని, చదువును ఆయు ధంగా మలుచుకొని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, అప్పుడే ఆ మహనీయుడి ఆశయాలకు సార్థకత అవుతుంది అన్నారు. అలా మనం ఎదిగినప్పుడే అంబేడ్కర్ కు మన నిజమైన నివాళి అర్పించినట్టని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచే సారు.ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభి మానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.