కస్తాల గ్రామంలో ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు .

* బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి ఘన నివాళి. * సామాజిక న్యాయం–సమానత్వంపై విశేష కృషి . * ఆయన చూపిన మార్గం కేవలం ఒక వర్గానికే కాదు, సమాజం మొత్తానికి దారి చూపే దీపస్తంభం. * అంబేద్కర్ జయంతి వేడుకల్లో గ్రామ పంచాయతీ పాలక వర్గం.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 15 :  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను చండూరు మండలం కస్తాల గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. అంబేద్కర్ మేధావి.. ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వేషన్లు అందించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి అపూర్వమని అన్నారు. భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పదెనిమిది రోజులు సమయం పట్టిందని, ఆ కాలంలో ఆయన చేసిన త్యాగాలు అమూల్యమని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం సాధించేందుకు పునాది వేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం రచించి బలహీన వర్గాల రక్షణకు మార్గం సుగమం చేశారని తెలిపారు. కులవ్యవస్థ నిర్మూలన కోసం, సమాజంలో సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేష్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లేదన్న సత్యం , గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేష్ , జీ పీ ఓ యాదయ్య ,వార్డు మెంబర్లు మెరుగు అంజయ్య,దోణాల శ్రీనివాస్ రెడ్డి, దోటి శ్రీను,అమలూరి అశోక్,బొమ్మరబోయిన కవిత మరియు గ్రామ ప్రజలు లింగ రెడ్డి,బిక్షం రెడ్డి, అంజయ్య ,లింగయ్య ,దుర్గమ్మ, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *