సివిఆర్ న్యూస్ కు లీగల్నోటీసు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 10 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ తనపై ఫేక్ న్యూస్ ప్రసారం చేసి,తన పరువుకు తీవ్ర నష్టం కలిగించిన సివిఆర్ న్యూస్ తెలుగు యాజమాన్యానికి,ఎడి టర్, ఆంకర్, రిపోర్టర్ లకు లీగల్ నోటీసులు పంపించిన బిజెపి రాష్ట్ర నాయకులు, ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి ప్రాంతంలోని ఒక ఫౌండే షన్ నిర్వాహకుడు,మరో సెల్ ఫోన్ స్టోర్స్ యజమానితో కలిసి ఫేక్ ఎల్ఆర్ ఎస్ దందా చేస్తున్నారని తప్పుడు ప్రసారం చేయడాన్ని ఆయన తీవ్రంగా గర్హిస్తూ… వెంటనే వీడియో తొలగించి,క్షమాపణలు వ్రాతపూర్వకంగానూ,తమ ఛానల్ ద్వారానూ 7 రోజుల్లోప్రకటించాల ని,లేనిచో క్రిమినల్ 25 లక్షల డిఫమేషన్ నష్టపరిహారం చెల్లించాలని, లేనిచో న్యా యస్థానం ద్వారా కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. మీడియాకు సూచన : మా పోరాటంలో నష్టపోయిన కొంతమంది చేస్తున్న విష ప్రచారంపై మా అభిప్రాయం, వాస్తవాలు తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయాల ని తాము ఎలాంటి తప్పుడు లావాదేవీ లు చేసే అవకాశం ఉండదని కసిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *