పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీరు అందించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

* గతానికి ఇప్పటికీ త్రాగునీటి డిమాండ్ బాగా పెరిగింది . * జనాభా పెరుగుదలకు అనుగుణంగా తాగునీటి అవసరాలు తీర్చాలి . * ఫ్లో మీటర్ వేస్టేజ్ ని తగ్గించి ట్యాంకులు పంపుల కెపాసిటీ ని పెంచాలి . *సరిపోయే విధంగా ఉండేలా గతంలో ప్రణాళికలు లేవు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి. * త్రాగునీరు అందించడానికి కావలసిన అంచనాలను రూపొందించండి . *త్రాగునీటి సమీక్ష సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఏప్రిల్ 10. మునుగోడు నియోజకవర్గం లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గతంలో త్రాగునీటి కేటాయింపుల ప్రణాళికలు సరిగా లేవని అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డిమాండ్ కు తగ్గ సప్లై సరిపోవడంలేదని.. వీటిని అధిగమించడానికి సమగ్రమైన త్రాగునీటి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారుకూడా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేసవిలో తాగునీటి సమస్యలు దళిత కుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్య ల పై మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులు నియోజకవర్గ నాయకులు చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తుతం అవసరానికి కావలసిన త్రాగునీటి డిమాండ్ ఎంత ఉంది?సప్లై ఎంత చేస్తున్నారు? సప్లై లో లీకేజీల పరిస్థితి, పంపుల కెపాసిటీ ఎంత?ఓవర్ హెడ్ ట్యాంకుల కెపాసిటీ ఎలా ఉంది అనే విషయాలకు సంబంధించి కూలంకషంగా చర్చించారు… మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి కేటాయింపులు జరిపినప్పుడు పెరుగుతున్న జనాభా డిమాండ్ కు అనుగుణంగా కేటాయింపులు జరపకపోవడం వల్ల ప్రస్తుతం పెరిగిన జనాభా కు త్రాగునీరు సరిపోవడంలేదని దీనిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు త్రాగునీరు అందించడానికి కావలసిన అంచనాలను రూపొందించండి . చౌటుప్పల్ మున్సిపాలిటీ లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం చూయించే జనాభా లెక్కల కంటే పదుల రెట్లు జనాభా పెరిగిపోయారని మిగతా పట్టణాలలో కూడా జనాభా ప్రస్తుతం పెరిగిన జనాభాతో పాటు భవిష్యత్తులో పెరగబోయే జనాభాకు అనుగుణంగా త్రాగునీటి అవసరాలు తీర్చే విధంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక సమగ్రమైన త్రాగునీటి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు పెరిగిన జనాభాకు అనుగుణంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 46.51 ఎం ఎల్ డి త్రాగునీరు అవసరం ఉండగా ప్రస్తుతం 27.8 ఎమ్మెల్డీల మీరు మాత్రమే వస్తుందని అధికారులు విన్నవించారు… ఈ గ్యాప్ ను పూడ్చడానికి ఎక్కువ మొత్తంలో త్రాగునీరు వచ్చేలా చేయడానికి కావాల్సిన బల్క్ సప్లై, మోటార్ల కెపాసిటీ పెంపుదల, ఇంట్రా నెట్వర్క్ కెపాసిటీ పెంపు, ఓవర్ హెడ్ ట్యాంకుల పెంపు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కెపాసిటీ పెంపు అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.. ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ జిల్లా ఉన్నతాధికారులతో పాటు ఆయా మండలాల ఇంజనీర్లు, చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీల కమిషనర్లు చైర్మన్లు మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *