భగవద్గీత కంఠస్థ పోటీలలో బంగారు పతకాలు సాధించిన బాల భారతి విద్యాలయం విద్యార్థులు.

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 10 ,తల్లాడ రిపోర్టర్ అవధూత దత్తపీఠం మైసూరు వారి నిర్వహించిన ఆన్ లైన్ భగవద్గీత కంఠస్థ పోటీలలో 8 మంది బాలభారతి విద్యాలయం విద్యార్థులు బంగారు పతకాలని సాధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు 738 శ్లోకాలను ఉచ్చరణ దోషణ లేకుండా పఠించి భగవద్గీత పోటీల్లో విజేతలుగా నిలిచారు. వీరు మే 10వ తేదీన గణపతి సచ్చితానంద స్వామిజీ చేతుల మీదుగా మైసూర్ లో బంగారు పతకాలను అందుకోనున్నారు. ఈ విద్యార్థులు కే . వేదార్యన్, వి. శ్యామ, పి. కార్తికేయ, ఆర్. రాజి, ఆర్. రేష్మిత, కే. హేమాన్విత, టి. క్రిషిత, వి. రామ మనోహర్ లను, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు సునీత మండల విద్యాశాఖ అధికారి ఎన్. దామోదర్ ప్రసాద్ కే యస్ ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్ , డైరెక్టర్ కోటగిరి శ్రావణి , ప్రిన్సిపాల్ తాళ్లూరి రామారావు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *