భజన ఆశ్రమానికి భూదానం


పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో శ్రీ శివరామ దీక్షితుల భజన ఆశ్రమ నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాతలు రెండు గుంటల భూమిని దానం చేసినట్లు భజన మండలి సభ్యులు డాక్టర్ అవుసుల నర్సింలు వెల్లడించారు . అదే గ్రామానికి చెందిన వడ్డేపల్లి జయరాం రెడ్డి, తో పాటు బైండ్ల నారాయణ, అదృష్ణ సోదరులు భూదానం చేసినట్లు ఆయన తెలిపారు, కాగా ఆశ్రమ నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన డాక రెడ్డి గారిమధుసూదన్ రెడ్డి తో పాటు స్థానికులు ఆర్థిక సాయం అందజేశారని, ఇందుకు సహకరించిన దాతలకు స్థానిక సర్పంచ్ అనిత నరేందర్ రెడ్డి , శివరామ దీక్షితుల శిష్యులతో పాటు భజన మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *