గొల్లపల్లి అంగన్వాడి కేంద్రంలోపోషణ పక్వాడ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి ఎస్టి కాలనీ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం తల్లులందరినీ పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ సమావేశపరిచి పోషకాహారం పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి మునగాకు మిగిలిన ఆకుకూరలు చిరుధాన్యాలు పాలు గుడ్లు వంటి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలను గర్భవతులు మరియు బాలింతలు పిల్లలు తీసుకునేటట్లు కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి ఇంకా ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడదు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాలను బయట నుండి తీసుకువచ్చి తినకూడదు అలాగే పిల్లలకు ఇవ్వకూడదు పోషక విలువలు పోకుండా ఇంట్లోనే ఆహారాన్ని తయారుచేసి పిల్లల కానీ తల్లులకు కానీ సంపూర్ణ ఆహారాన్ని తీసుకునేటట్లు చూడవలెనని కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమైనది ఈ కార్యక్రమం నందు సూపర్వైజర్ ఎం. పద్మ అంగన్వాడీ కార్యకర్తలు. సిహెచ్ పోలమ్మ. పి. పద్మ. బి విజయ్ కుమారి. తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *