రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించడం వల్ల,ప్రమాదాల సమయంలో మరణాలు తగ్గించవచ్చు:ఆర్ సీ పురం సీఐ విద్యాసాగర్ రెడ్డి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 11 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ శుక్రవారం రోజు మంజీరా పైప్‌లైన్ రోడ్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాము.ఈ కార్యక్ర మం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం,హెల్మెట్ ధరిం చడం ద్వారా ప్రమాదాల సమయంలో గాయాలు మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలియ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్ సి పురం సిఐఆర్ విద్యాసాగర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి లో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొం దించేందుకు ఈరోజు మంజీరా పైప్‌లైన్ రోడ్ వద్ద హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.ఈ సంద ర్భంగా ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం వల్ల తలగాయాల తీవ్రత గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రాణ నష్టం నుంచి రక్షణ పొందవచ్చని వివ రించారు. దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదా ల్లో అధిక శాతం మరణాలు తల గాయా ల వల్లనే సంభవిస్తున్న నేపథ్యంలో హెల్మె ట్ వినియోగం అత్యంత అవసరమని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపి వారికి భద్రతపై అవగా హన కల్పించడం తో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించ డం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్. విద్యా సాగర్ రెడ్డి మాట్లా డుతూ హెల్మె ట్ ధరించడం కేవలం చట్ట పరమైన నిబంధన మాత్రమే కాకుండా కుటుంబా న్ని కాపాడే రక్షణ కవచమనిపేర్కొన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణన ష్టానికి దారితీ స్తుందని, హెల్మెట్ వాడకం ద్వారా అనేక ప్రమాదాల్లో ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతకే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నా మని, రానున్న రోజుల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ఎస్సై రాము లు, ఎస్సై జి. మల్లన్న, ఏఎస్సై మల్ల య్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పని శసరిగా పాటిస్తూ హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్సీపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్ విద్యాసాగర్ రెడ్డి తోపాటు ఎస్ ఐ రాములు,,మల్లన్న ఏఎస్ఐ మల్లయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *