గర్భిణి స్త్రీల ఆహ్వానం కార్యక్రమం నిర్వహణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో..1&2 అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడలో భాగంగా గర్భిణి స్త్రీల ఆహ్వానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ సర్పంచ్ వేపూరి పద్మ హాజరై.. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించే యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.0-5 ఐదు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రంలో నమోదయ్యేలా చూడాలన్నారు. మరియు గర్భిణీ స్త్రీలకు పిల్లలకి ఇమేజెస్ కార్యక్రమం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు హెచ్ బి టెస్ట్ లను నిర్వహించారు..ఈ కార్యక్రమంలో… ఉప సర్పంచ్ చాట్ల శ్యామల, వార్డు మెంబర్ చాట్ల లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు లేయమ్మ. అలివేలు మంగమ్మ, ఏఎన్ఎం సరళ, ఎమ్మెల్ హెచ్పి మధుమై, ఆశా వర్కర్ దేవమణి,గర్భిణీ బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *