టిడిపి తోనే బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయి. టిడిపి పెట్టిందే బీసీల కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మాహత్మ జ్యోతిబా పూలే జయంతోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కిష్టమ్మ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే 11 ఏప్రిల్ 1827 మహారాష్ట్రలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ మరియు అతను భార్య సావిత్రిబాయి పూలే ని చదివించి భారత దేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులు గా తిది తీర్చిన ఘనత పోలే కే చెందుతుంది అంతేకాదు ఆడపిల్లలకు మహిళలకు విద్య ఉండాలని 1848 లో తొలి బాలికల పాఠశాల ప్రారంభించి బాలికలకు ఆదర్శంగా నిలిచినాడు మహిళ విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన మహానీయుడు అంతేకాదు కుల వ్యవస్థకు వ్యతిరేక పోరాటం చేసినారు, రైతుల హక్కుల కోసం పోరాడిన ఘనత పూలేకి చెల్లుతుంది ఇలా చెప్పకుంటు పోతే తన జీవితం మొత్తం సమాజ సేవ, మహిళల ఉన్నతి కోసం, అందరికీ విద్య తో సమాజంలో గౌరవం ఉంటుందని పోరాడిన వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు అలాగే స్వర్గీయ నందమూరి తారకరామారావు బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు అంతేకాదు అదే బాటలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీల చట్టం కూడా తీసుకొని వస్తానని చెప్పినారు అదే బాటలో యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలిపినారు ఈ కార్యక్రమానికి వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు బీసీ సంఘాల నాయకులు సదస్సులు పాల్గొని బీసీల పట్ల అవగాహన తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *