పయనించే సూర్యుడు ఏప్రిల్ 12, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా మహిళల విద్య కోసం జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ,వార్డు మెంబర్లు , అంగన్వాడీ టీచర్ , ఆశ వర్కర్, వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.