సామాజిక విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే : చమర్తి

పయనించే సూర్యుడు-12-04-2026-రాజంపేట న్యూస్ : బహుజన బాంధవుడు, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు, ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం వేసిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. స్వతంత్రం రాకముందే సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ను స్ఫూర్తిగా తీసుకొని,వారి ఆశయాల సాధనకు చేయాలని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. పూలే మహిళ అక్షరాస్యత మరియు అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం యనలేని కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *