
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 13 జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా గాలం నాగేశ్వరావు స్థలం నందు పరలోక సన్నిధి మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ సువార్త మహాసభలు కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రేమ, శాంతి, క్షమ, దయ అనే విలువలను మానవాళికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపబడ్డారు. ఆయన బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి యేసు ప్రభువు తన జీవితమంతా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ పేదలపై బలహీనులపై, బాధితులపై అపారమైన ప్రేమను చూపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గొర్రెపాటి బుల్లయ్య, నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షులు బండి రంజిత్, మాజీ ఎంపీటీసీ సభ్యులు దొంగల జానకి రామయ్య, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు తదితరులు పాల్గొన్నారు