ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ బి . యాదగిరి .

* ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరి . * ధోనిపాముల, నేర్మట గ్రామాల ఉపాధి కూలీలతో మాట్లాడారు . * నేర్మట గ్రామంలో నారపాక సైదమ్మ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎంపీడీఓ . *ధోనిపాముల, నేర్మట గ్రామాలలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ యాదగిరి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 14 : చండూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ బండారు యాదగిరి సోమ‌వారం ప‌రిశీలించారు. మండల పరిధిలోని ధోనిపాముల, నేర్మట గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. ఎండగాక ముందే ఉదయం ఏడు గంటలకి పనికి వచ్చి చెప్పిన పనిని తొందరగా ముగించుకుని వెళ్లవలసిందిగా ఆయన కూలీలకు సూచించారు. నర్సరీలలో నారు, అంటు మొక్కలను పెంచి, మొలకలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం చేశారు. పని ప్రదేశంలో వారికి కావలసిన కనీస సదుపాయాలు షేడ్ నెట్, మంచినీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెండ్ మరియు పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం  నర్సరీలను పరిశీలించి మొలకలు బ్యాగులలో నారు గానీ, అంటూ మొక్కలు గాని పెట్టి వంద శాతం మొలకలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శికి తగు సూచనలు, సలహాలు చేశారు. నర్సరీలలో నారు, అంటు మొక్కలను పెంచి, మొలకలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నేర్మట గ్రామానికి చెందిన నారపాక సైదమ్మ ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామల సర్పంచులు, ఉపాధి హామీ ఈసీ, టీఏలు, ఎఫ్ఏలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *