బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,రవికుమార్ యాదవ్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఈరోజు మసీద్ బండ బీజేపీ కార్యాల యంలో బూత్ కమిటీలు పూర్తి, పార్టీ బలోపేతం చేసేందుకు చేపట్టవల సిన కార్యక్రమాలపై నిర్వహించిన భార తీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావే శం లో జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివా స్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్ ,రవీందర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేష్ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వా నికి రెండున్నరేళ్లు సమయం ఇచ్చాం,ఏ మైనా చేస్తారేమో నని,ఇప్పటికీ ఇంకా అవే మాయమా టలతో ప్రజలను మభ్య పెడుతూనే ఉన్నారు, రాబోయే మున్సిప ల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీని కోసం మన నియోజకవర్గంలోని ప్రతి బూత్ లో బూత్ కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు,అలాగే బూత్ అధ్య క్షులు, బూత్ కమిటీల సభ్యులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూ చించారు, మనం ప్రజలకు చేరువగా ఉంటే ప్రజల మద్దతు మనకు ఎల్లప్పు డూ ఉంటుందని అన్నారు,కేంద్ర ప్రభు త్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను వివరించి వీలైనంత ఎక్కువ మందిని పార్టీ లోకి ఆహ్వానించాలని కోరారు, నాయకులు ,కార్యకర్తలందరూ పార్టీ బలపేతానికి కృషి చేయాలన్నారు, అలాగే అంబేద్కర్ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి బూత్ లో నిర్వహించాలన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, అశోక్ కురుమ,రవీందర్ రావు,బుచ్చిరె డ్డి,వసంత్ యాదవ్, కేశవరావు,రామ రాజు రాధాకృష్ణ యాదవ్ ,అనిల్ గౌడ్, మాణిక్ రావు, కృష్ణo రాజు,రాజేష్ గౌడ్, పద్మ, సింధు రెడ్డి,బిందు,విజయల క్ష్మి,దుర్గాప్రసాద్, మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *