
పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) గత 40 సంవత్సరాలుగా నిరంతరం నిర్విరామంగా ప్రభుత్వ వైద్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా సేవలందించి ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న శ్రీ కుంబర్తి రవీందర్ కు శనివారం రవీంద్ర భారతి లోని ఆడిటోరియంలో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 1999వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవీందర్ కు శాలువా, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రదేష్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీమంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ వి.హనుమంతరావు, తెలంగాణ అసెంబ్లీ మొదటి సభాపతి మరియు తెలంగాణ శాసనమండలి టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సిరికొండ మధుసూదనాచారి,రిటైర్డ్ డిజిపి మరియు ఆలిండియా బహుజన్ పార్టీ కన్వీనర్ పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ శ్రీ బి బాలరాజ్ గౌడ్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, టిసిసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మేధావులు, విద్యావేత్తలు పాల్గొని కుంబర్తి రవీందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కుంబర్తి రవీందర్ మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో జన్మించి విజయభ్యాసం చేసి మాదకద్రవ్యాల వ్యతిరేకంగా క్షయ ఎయిడ్స్ గుండె వ్యాధులు కిడ్నీ వ్యాధులు మలేరియా శాంతి స్థాపనకు పర్యావరణ పరిరక్షణకై ఎన్నో ర్యాలీలు సదస్సులు నిర్వహించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.