వైకాపా అరాచకాలను ఎండగడతాం – చమర్తి

పయనించే సూర్యుడు-14-04-2026-రాజంపేట న్యూస్ : గత వైకాపా ప్రభుత్వంలో వైసిపి నాయకులు పాల్పడిన భూ అక్రమాలను, అరాచకాలను ఎండగడతామని, వారి ఆరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయం నందు రాజంపేట మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైకాపా అరాచకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ మోహన్ రాజు సూచించారు. అదేవిధంగా ఈనెల 16వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు చమర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పార్లమెంట్ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మండల క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *