పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 సాలూర : రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ అన్నారు. సాలూర మండల కేంద్రంలోని సాలూర గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ వైస్ చైర్మన్ నడిపి వసంత్ రెడ్డి ఏవో శ్వేత ఏఈఓ అపర్ణ గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి ఉప సర్పంచ్ బుయ్యన్ సురేష్ ఇంచార్జ్ సీఈవో సంజీవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందర్న రవి ఇళ్తేపు శంకర్ ఆల్లే రమేష్ అల్లె జనార్ధన్ నరేందర్ రెడ్డి రాజా గౌడ్ లక్ష్మణ్ మాజీ సీఈఓ బసవంతరావు రైతులు గంగారం నాగేష్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు