సిహెచ్సిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 14 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వివేకానంద సేవా సమితి,హాస్పిటల్ చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో 4వ వారం యిమ్మడిశెట్టి చిన ఆంజనేయులు జ్ఞాపకార్థం భార్య సత్యనారాయణమ్మ,కుమారుడు కృష్ణ,వెంకటరత్నం ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ సోమవారం కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో గత నాలుగు వారాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని,చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ఆసుపత్రికి వచ్చే రోగులుకు వేసవికాలం కావడంతో దాహార్తిని మజ్జిగ తీర్చుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్,గొల్లపూడి త్రిమూర్తులు,వాగు బద్రిష్,చల్లంచర్ల నాగేశ్వరరావు,బుజ్జి బాబు,టీ జగన్,జుత్తుల శ్రీను,స్కూల్ చైర్మన్ శ్రీను,వాగు బాబులు,రాకేష్,చక్రవర్తి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *