పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ కట్టకొమ్ముతండ గ్రామలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ నేనావత్ జ్యోతి పాండు నాయక్ మాట్లాడుతూ, అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, అంబేద్కర్ ఆశయాలను గ్రామంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమం లో భాగంగా గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మి గోవింద్ గ్రామ వార్డ్ మెంబర్ సాగర్, రాజశేఖర్, డీలర్ యాదగిరి ఆశ వర్కర్ లక్ష్మి,మాజీ వార్డ్ మెంబర్ రాజు, యూత్ నేనావత్ శివ, సాల్కి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమం విజయవంతం చేసారు.