సర్పంచ్ స్వాతి నేతృత్వంలో స్వచ్ఛ గ్రామం వైపు పెద్ద అడుగు

"మురికి మాయం పరిశుభ్రత పునాది వేసిన స్వాతి టీం"

(పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో మురికి కాలువల శుభ్రపరిచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సఫాయి కార్మికులతో పాటు అదనపు కూలీలను నియమించి గ్రామమంతా ఉన్న మొరిలను శుభ్రం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. మురికిని పూర్తిగా తొలగించి కాలువలను శుభ్రం చేయించడం ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు సర్పంచ్ స్వాతి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, వార్డ్ సభ్యులు రేణుక, సరిత, అనుషతో పాటు సఫాయి కార్మికులు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో చేపట్టిన ఈ శుభ్రత కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు స్థానిక ప్రజలు కూడా సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *