
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 రిపోర్టర్ కామని ప్రమోద్ 135 అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా పురస్కరించుకొని గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన సమావేశంలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ మిల్టన్ దుస్తులను బహూకరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మిల్టన్ గారినీ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ “రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రతి పౌరుడి బలం… అన్యాయం, అసమానతలను ఎదుర్కొనే శక్తి అదే. అంబేద్కర్ చూపిన మార్గంలో నడిస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది” అని దృఢంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు పంచాయతి కార్యదర్శి సుప్రజ ఉప సర్పంచ్ ఉప్పు రాజు మాజీ సర్పంచ్ పరుచూరి సుబ్బారావు పాలకవర్గ సభ్యులు కామిశెట్టి లక్ష్మి గుండ్లపల్లి విజయ్ వేములపల్లి వెంకట ప్రసాద్ రావు, చలిగంటి మల్లికార్జున్, భూక్య స్రవంతి, ఈలపొంగు కొమరమ్మ, మహమ్మద్ అజహర్ ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఎడ్ల నాగమణి గ్రామ ప్రజలు, యువకులు,నాయకులు, గ్రామ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.