డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ఆశయాలను కొనసాగిద్దాం:యం సి పి ఐ ప్రజా సంఘాలనాయకులు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని శేరిలింగం పల్లి, మియాపూర్, హైదర్ నగర్ లో ముజఫర్ అహమ్మద్ నగర్, ఓంకార్ నగర్, నడిగడ్డ తండా తదితర బస్తీలలో యం సి పి ఐ( యు ) -ప్రజా సంఘ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తదంతరం యం సి పి ఐ (యు) -ప్రజా సంఘ నాయకులు, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, అంగడి పుష్ప గార్లు మాట్లాడుతూరా జ్యాంగ హక్కులను కాలరాస్తున్న భారత పాలకవర్గాలు పీడిత ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసాయని ఆందోళన వ్యక్తం చేశారు .డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పీడిత బలహీన వర్గాలు రాజ్యా ధికారం కోసం ఉద్యమాలు చేపట్టాలన్నారు .దేశంలోని మానవా దులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజా హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నార న్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం దేశ ప్రజలందరికీ ఉచితంగా అందే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజలంతా ఉద్యమించాలన్నా రు.ఈ కార్యక్రమంలోయం సి పి ఐ (యు )- ప్రజా సంఘ నాయకులు,కుంభం సుక న్య, తాండ్ర కళావతి,టి అనిల్ కుమార్, యార్లగడ్డ రాంబాబు,శివాని, విమల, లలిత, శ్రీలత,ఇక్రాన్ షేక్,కృష్ణ, ఇ సాక్, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *