బోధన్ పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 బోధన్ :బోధన్ పట్టణంలోని మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *