అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదానం…

* అన్నదానం చేస్తున్న వార్డు కౌన్సిలర్ దివ్య సంతోష్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 బోధన్ :బోధన్ పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డ్ కౌన్సిలర్ దివ్యా సంతోష్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు,నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *