మే 13 వరకే శుభకార్యములకు అవకాశం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) మే 13 వ తేదీ వరకు అన్ని రకములైన శుభకార్యములకు అవకాశం ఉన్నదని రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్ ఒక ప్రకటన లో తెలిపినారు తదుపరి ఒక నెల రోజుల పాటు అధిక జ్యేష్ట మాసం ఉన్నందున నిశ్చితార్థం వివాహాలు గృహప్రవేశములు ఉపనయనాలు అన్న ప్రాశన అక్షరాభ్యాసం తది తర శుభకార్యములు చేయకూడదు తిరిగి ఒక నెల రోజుల అనంతరం నిజ జ్యేష్ట మాసం లో జూన్ 20 నుండి మళ్ళీ నెల రోజుల పాటు అన్ని రకాల శుభకార్యముల నిరభ్యంతరంగా చేసుకోవచ్చును ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి తమ ఇంటి శుభకార్యములు తగు విధంగా రూపకల్పన చేసుకోవాలి అని ముందస్తుగా ప్రకటన గా గుడి చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *