ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ప్రతిభ సాధించిన విద్యార్థి విద్యార్థులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను వి. మహేంద్ర 923 మార్కులు, వై .నందకిషోర్ 842 మార్కులు , కే .యశ్వంత్ 838 మార్కులు, బైపీసీ నుండి డి .జ్యోతిక 88 మార్కులు, జే .అంజలి 777, సిహెచ్. లోకేష్ 756 మార్కులు , సీఈసీ నుండి ఎం. వావిలేటమ్మ 761, ఏ . ప్రణయశ్రీ 749 , ఏ .అజయ్ కుమార్ 738 మార్కులు సాధించారు . అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీ నుండి యు .లక్ష్మీ ప్రభాస్ 446/470, డి . ఛార్మి 421/470, బి. పావని 371/470 , జూనియర్ బైపీసీ నుండి ఎస్ కే. గౌసియా 343 / 350 (98% ) , ఏ .సౌజన్య 404/455, ఏ .హాసిని 392/455 , జూనియర్ సీఈసీ నుండి వై. పెంచలయ్య 335 / 500 ,జి. భాను శంకర్ 320 / 500, జి .లోకేష్ 308 / 500 మార్కులు సాధించారు. మీరే కాక మరెందరో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. వీరందరిని ప్రిన్సిపాల్ కె. లక్ష్మీ జ్ఞానేశ్వరి అభినందించారు. మొత్తం మీద కళాశాలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 97% , ద్వితీయ సంవత్సరంలో 93 % ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు ఆయన వెంట అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *