వడియారం ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలంలోని ప్రాథమిక పాఠశాల వడియారంలో “రోడ్డు భద్రత” నియమాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధిరాములు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపంచకూడదని మరియు ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ మంది వాహనాలపై ప్రయాణించ రాదని పేర్కొనడం జరిగింది. విద్యార్థులు రోడ్డుకు ఎడమ వైపున నడవాలని, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోటనే రోడ్డు దాటాలని సూచించారు. “గమ్యం కన్నా ప్రాణం మిన్న” కాబట్టి ఆటోలో గాని ఇతర వాహనాలలో గాని పరిమితికి మించి ప్రయాణించకూడదని, మద్యం సేవించి వాహనాలను నడప రాదని తెలియజేయడం జరిగింది.ఈ అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *