శ్రీ రూపులమ్మ 136వ జాతర మహోత్సవాలు

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 16 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరంలో గ్రామ దేవత శ్రీ రూపులమ్మ అమ్మవారి 136వ జాతర మహోత్సవాలను ఈ నెల 16,17 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర మహోత్సవాలను నానిశెట్టి నారాయణరావు మెమోరియల్, నానిశెట్టి చారిటబుల్ ట్రస్ట్, మౌంట్ కార్మెల్ స్కూల్ (కాకినాడ) ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సమక్షంలో నిర్వహించబడుతున్నాయి. గరగ నృత్యములు, శక్తి వేషములు,పల్లవి ఆర్కెస్ట్రా, తీన్మార్ బ్యాండ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనంతరం 17వ తారీకు తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం, కోలాట ప్రదర్శనలు నిర్వహించబడును. ఆలయ ధర్మకర్తలు కీర్తిశేషులు తూమురౌతు సోమరాజు కుమారుడు సూర్యనారాయణ, మల్లికార్జునరావు అనుమతితో కీర్తిశేషులు నానిశెట్టి నారాయణరావు కుమారులు నానిశెట్టి మణికంఠ, నాని శెట్టి వీరాంజనేయ సాయిరాం, మిత్రుడు పాబోలు వెంకట వినోద్ బాబు లు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజలందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కృప కటాక్షాలకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *