పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో డిండి గ్రామ సర్పంచ్ నల్లగంతుల రవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి కావడం తో పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోరటి జంగయ్య, ఉపసర్పంచ్ కౌసర్ రషీద్, వార్డు సభ్యులు భూషిపాక బాలయ్య,గుర్రం సురేష్,మూడవత్ జైపాల్,నూకం చంద్రయ్య, అమృత్, కుత్తటి మహేష్, కర్నాటి అజయ్ కుమార్, పొలం రాంబాబు, వావిల్లా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.