పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 రిపోర్టర్ బొద్దుల భూమయ్య తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాలలో నిర్వహించిన చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని 2023 ఎన్నికల్లో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కన్నా ముందు చేనేతలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చేనేతలపై ఉక్కుపాదం మోపుతుందని గతంలో చేనేతలకు ఉన్న పలు సంక్షేమ పథకాలు నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని చేనేత కార్మికుల పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు గా వారి జీవనాన్ని మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిందని 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యారుధుల ఏక రూప దుస్తుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూపాయిలు 105.54 కోట్ల ఆర్డర్ ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశ కలిగించింది అంతే కాకుండా ప్రభుత్వ సంక్షేమ శాఖలు 200 కోట్ల విలువైన దుస్తులు దుప్పట్లు తయారికి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్తాపానికి గురి చేసినది పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుండి ఈరోజు వరకు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో 36 మంది వరకు తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మ హత్య చేసుకోవడం చాన బాధాకరమైన విషయమని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు టైగర్ అలె నరేంద్ర సిరిపురపు యాదయ్య లాంటి ఎందరో ప్రాణాలను సైతం అర్పించిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోకూడదని పేర్కొన్నారు. రూపాయిలు 105.54 కోట్ల ఆర్డర్ ను రద్దు చేసిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 200 కోట్ల రూపాయలు దుస్తులు దుప్పట్ల తయారీకిఆర్డర్లను వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని అదే విధంగా నేతన్నకు చేయూత వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి కార్మికుల ఆదాయం పెంచాలని ముడి సరుకులైన నూలు రంగులను తక్కువ ధరకే ప్రభుత్వం అందించాలని తక్కువ వడ్డీ రుణాల అప్పుల భారం తగ్గించే చెర్యలు ప్రభుత్వం చేపట్టాలని చేనేత ఉత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్ కలిపించి ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు ప్రభుత్వం సహకరించాలి రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత నుండి జౌళి శాఖ ను వేరు చేయాలని నేతన్నలకు రుణ మాఫీ పూర్తి స్థాయిలో చేయాలని ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినది.
ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘాల నాయకుడు తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు రుక్మ రావు,కార్యదర్శి అడిచర్ల రాజేశం, నాయకులు రవి, శ్రీనివాస్ , నారాయణ, సత్యనారాయణ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేత కార్మికుల ఐక్యత వర్ధిలాలి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి తో సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారంలో వాటా కోసం పోరాడుదాం పోరాడుదాం.అని నినాదాలు చేశారు…