పెండింగ్లో ఉన్న ఇండోర్ స్టేడియం వెంటనే పూర్తి చేయండి ఎస్ఎఫ్ఐ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్లో లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంని పూర్తిచేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాట్లాడుతూ 2018లో టీడీపీ ప్రభుత్వం రూ 2కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విల్లా కిష్టప్ప నగర్లో జిల్లా క్రీడా ప్రాధికారక సంస్థ 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 2018 ఫిబ్రవరిలో ప్రారంభించారు దాదాపు ఐదేళ్ల నుంచి మొండి గోడలకే పరిమి తమైంది ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా వడలేదు దీంతో క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పనులను ప్రారంభించి పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారు. స్టేడియం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే 60% పూర్తయింది ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి స్పందించి ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించి వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడాకారులుగా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు సంజయ్ కార్యదర్శి శశిధర్ జగన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *