వేముల నర్వ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 11 వత్సవాయి మండలం, వేముల నర్వ గ్రామంలో ఉపాధి హామీ నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో 400 మీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రిబ్బన్ కట్ చేసి రోడ్లను ప్రారంభించారు. వేముల నర్వ పాత గ్రామం మరియు కొత్త గ్రామం మధ్య కనెక్టివిటీ మెరుగుపడేందుకు నిర్మించిన ఈ రోడ్డు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ రహదారి నిర్మాణం కోసం గ్రామానికి చెందిన దాత తాళ్లూరి మాధవరావు తమ స్వంత స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరించిన తాళ్లూరి మాధవరావు ని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. అనంతరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిట్టూరి సుభాష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల పెంపు పై ఎమ్మెల్యే గారు వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించి, ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, పెద్ది రామారావు, చిట్టూరి రమేష్, నర్మనేని శ్రీను, ఉప్పుగండ్ల వెంకటేశ్వరరావు, మండల సమైక్య అధ్యక్షురాలు సాగర్ల కృష్ణవేణి, ఇనపనూర్తి వీరయ్య, చెన్న బాలకృష్ణ, మార్కెట్ యార్డు డైరెక్టర్ తుడుం శైలజ, గుంటూరు నాగేశ్వరరావు, చల్ల కృష్ణ, తాళ్లూరి జనార్ధనరావు, గ్రామ సమైక్య అధ్యక్షురాలు నూతలపాటి నాగేంద్రం, కమతం లాజరు, షేక్ యాకుబ్ అలీ మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *