పయనించే సూర్యుడు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 90 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్ 16వ వార్డులో కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణ మహిళా ఎస్ఐ పుష్పాలతా రెడ్డి సహకారంతో వార్డు ప్రజలకు “అరైవ్ అండ్ అలైవ్” అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు పట్టణ మహిళ ఎస్ఐ పుష్పలత రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారా అశోక్, ఎం. నర్సిములు, రాజు, ఖయ్యూం, రియాజ్, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.