విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

టీ వి ఏ ఈ జె. ఏ. సి గజ్వేల్ డివిజన్ చైర్మన్ సిరినేని భూపతి రాజు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 16 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా సమ్మెలో భాగంగా గజ్వేల్ డివిజన్ ఆఫీసు ముందు మొఖానికి నల్ల మాస్కులు పెట్టుకొని నిరసన తెలియజేసారు జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు ఉదయం 9 గంటల నుండి సమ్మెలో భాగంగా గజ్వేల్ డివిజన్ ఆఫీస్ ముందు ఆర్టిజన్స్ పిస్ రేట్, కార్మికుల సమ్మెలో పాల్గొని మద్దతు తెలుపుతు మాట్లాడుతున్న గజ్వేల్ డివిజన్ చైర్మన్ సిరినేని భూపతి రాజు సమ్మెను ఉద్దేశించి ఆర్టిజన్స్ కు ఏపీ ఎస్బి రూల్స్ ఇచ్చి కన్వర్షన్ ఇవ్వాల ని అలాగే అన్మాండ్ వర్కర్స్ ను సంస్థలు విలీనం చేసుకోవాలని పీస్ రేట్, కార్మికులకు 11 నెంబర్ జీవో ప్రకారం 30 రోజుల పరిధిలో కల్పించాలని విద్యుత్ సంస్థల పని చేసినటువంటి ఆర్టిజన్ కార్మికులందరికీ కూడా ఏపీఎస్పీ రూల్స్ ఇవ్వాలని విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వము సంస్థల విలీనం చేసుకుంటునామాని చెప్పి ఎటు కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఎన్నికల ముందు పాదయాత్రలలో అనేక సభలలో ఇచ్చినటువంటి హామీలను విద్యుత్ కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు గతంలో డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్న వాళ్లను రెగ్యులర్ చేసుకున్న వాళ్లను ఏ విధంగా అయితే రెగ్యులర్ చేశారో ఆ విధంగా రెగ్యులర్ చేయాలని కోరారు అన్మాండ్ వర్కర్స్ ని కూడా సంస్థలో విలీనం చేసుకోవాలని పీస్ రేట్ ,వర్కర్లను జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ రోజు నుండి సమ్మె కొనసాగుతుంది కార్మికులందరూ విజయవంతం చేయాలన పిలుపునిచ్చారు సమస్య పరిష్కారమైతే వరకు మీ పోరాటం కొనసాగిస్తాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ కన్వీనర్ వై శ్రీధర్, గజ్వేల్ డివిజన్ వైస్ చైర్మన్ దూలం యాదగిరి గౌడ్,ఖలీల్ పాషా, గజ్వేల్ డివిజన్ కో కన్వీనర్ చంద్రం యాదవ్,స్వామి , గజ్వేల్ డివిజన్ కోశాధికారి కుంట కిషన, గజ్వేల్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ్ల శ్రీనివాస్ ,గజ్వేల్ డివిజన్ జాయింట్ సెక్రెటరీ శ్రావణ్ రెడ్డి , జంగీర్, బుచ్చిరెడ్డి,బాలకిషన్ ,స్వామి గజ్వేల్ డివిజన్ జేఏసీ జిల్లా నాయకులు,రాజేందర్ రెడ్డి,నరేష్ రెడ్డి లక్ష్మణ్ , రమేష్ గౌడ్,గిరి యాదవ్,పద్మనాభంఅశ్విని, ప్రియాంక, స్వప్న, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *