పూలే ఉత్సవ కమిటీ లో రాష్ట్ర కన్వీనర్ గా యాగండ్ల రమేష్ గౌడ్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు,కోరుట్ల ఏప్రిల్ 11 (రాధాకృష్ణ ) హైదరాబాద్ లో ఏప్రిల్ 11న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోయే మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల రాష్ట్ర ఉత్సవ కమిటీ లో ఇప్పపెల్లి గ్రామానికి చెందిన తెలంగాణ బీసీ సంఘం జగిత్యాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్ ని రాష్ట్ర ఉత్సవ కమిటీలో కన్వీనర్ గా నియమితులయ్యారు ఈ సందర్బంగా సందర్భంగా యాగాండ్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్,చైర్మన్ హనుమంతరావు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేసినందుకు ఈ గౌరవం దక్కినదని హర్షం వ్యక్తం చేశారు ఈనెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *