
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11: (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ కౌన్సిలర్ల బృందంతో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన చైర్మన్ రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న చికిత్స మరియు సౌకర్యాల గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూనూస్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి పాత్ర కీలకమని, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు, సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ తరపున పూర్తి కృషి చేస్తామని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి గైర్హాజరైన ఒక వైద్యుడి తీరుపై ఈ సందర్భంగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.