పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మాచారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి కావడం తో పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి , ఉపసర్పంచ్ ,తదితరులు పాల్గొన్నారు.